గురువారం, ఏప్రిల్ 25, 2024
Homeజాతీయంకరోనా దెబ్బకు డాక్టర్లు రాజీనామా

కరోనా దెబ్బకు డాక్టర్లు రాజీనామా

కరోనా మహమ్మారి దెబ్బకి వింత సంఘటనలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఎలా అంటుకుంటుందో అని ప్రజలు భయంతో అందరూ అప్రమత్తంగా భయంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రల్లో కూడా కరోనా వైరస్ పంజా అధికంగా విసురుతున్న వేళ వైరస్ సోకుతుందనే భయంతో కామారెడ్డి లో  డాక్టర్లు ఆరుగురు ఒకేసారి రాజీనామాలు చేశారు.

కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూ పరిస్థితి ఉద్రిక్తంగా చేస్తున్నాయని ఆ మహమ్మారి తమకూ సోకుతుందనే ఆందోళన వ్యక్తంచేశారు డాక్టర్లు. ఇంట్లో కూడా ఒత్తిళ్లు పెరిగాయని తాము విధులకు హజరుకావడాన్ని ఇంట్లో వాళ్ల ఒప్పుకోవడం లేదని డాక్టర్లు చెప్తున్నట్లు సమాచారం.

ఇక కరోనా వైరస్ భయంతో  జిల్లావ్యాప్తంగా కేంద్రాల్లో పలు ప్రైవేట్ హాస్పటల్స్ ఇప్పటికే క్లోజ్ చేశారు. ఇక ఆస్పత్రులు తక్కవ కావడంతో ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆ ఒత్తిడి పెరిగింది. రోజుకు 300 మంది కరోనా ఉందేమో అనే అనుమానంతో ఆ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారని రాజీనామా చేసిన డాక్టర్స్ చెబుతున్నారు.

ప్రస్తుతం హాస్పిటల్స్ కి అవుట్ పేషెంట్ల తాకిడి పెరిగి అసలు ఎవరికి వైరస్ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏదోలా కష్టపడి 24 గంటలూ సేవలందుస్తూ తాముకూడా అస్వస్తతకు గురవుతున్నట్లు వెళ్లడించారు. అయితే ఈ విషంపై చర్చించి ఆస్పత్రి సూపరింటెండెట్ అశోక్ కుమార్ కు తమ రాజీనామాలు అందించి వైద్యం చెయ్యడానికి వారు సిద్ధంగా లేమని పేర్కొన్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular