మంగళవారం, ఏప్రిల్ 16, 2024
Homeజాతీయం20 లక్షల కోట్ల ప్యాకేజ్ అందుకేనట వివరాలు ఇవే

20 లక్షల కోట్ల ప్యాకేజ్ అందుకేనట వివరాలు ఇవే

వివిధ మంత్రిత్వ శాఖలతో స్వీయ ఆధారిత భారత్  పేరుతో  నిన్న ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజిని రూపకల్పన చేసినట్టు తెలిపారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. భారత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఆర్ధిక ప్యాకేజ్ ని ప్రకటించడం జరిగిందని అన్నారు.

అందుకే ఆత్మనిర్భర్ భారత్ అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఆర్ధిక, మౌళిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ఈ ఐదు సూత్రాలతో ప్యాకేజ్ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వదేశీ బ్రాండ్లు తయారుచేసి వాటి బ్రాండ్ విలువ పెంచడమే ఈ ప్యాకేజ్ ముఖ్య ఉద్దేశమని నిర్మల సీతారామన్ అన్నారు..

నిన్న ప్రధాని ప్రకటించి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ పై పూర్తీ వివరాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీతారామన్ ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల కాంట్రాక్టు పనులు పూర్తి చేయడానికి ఆరు నెలల అదనపు సమయం ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 200 కోట్ల విలువ వరకు దేశీయంగానే సేకరణ ఉంటుంది. 200 లోపు కొనుగోళ్ళకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదని ఆర్ధికమంత్రి అన్నారు..

ఎమ్.ఎస్.ఎమ్.ఈ లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 50 వేల కోట్లు కేటాయిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం పెంపుకోసం 10 వేల కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్ ఇస్తున్నామని అన్నారు. ఎన్.పీ.ఏ  ముప్పు ఎదుర్కొంటున్న ఏ ఎమ్.ఎస్.ఎమ్.ఈ అయినా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని నిత్మలా సీతారామన్ అన్నారు..

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular