శుక్రవారం, మార్చి 29, 2024
Homeరాజకీయంనేడు హైకోర్టులో జగన్ సర్కారుకు మరో మొట్టికాయ....

నేడు హైకోర్టులో జగన్ సర్కారుకు మరో మొట్టికాయ….

వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు కావొస్తుంది అయినా ప్రభుత్వం నడిపే విదాన్నాన్ని ఇప్పటివరకూ గాడిన పెట్టలేకపోయారు జగన్ మోహన్ రెడ్డి. ఇసుక దందా, భూదందా అంటూ ఇప్పటికీ కోర్టుల్లో స్టేలతోనే ప్రభుత్వ పనితనం ఎలాంటిదో ప్రజలకు అర్ధమైపోయింది. ఇక జగన్ సర్కారుకి న్యాయస్థానాలు వేసిన మొట్టికాయలైతే త్వరలో సెంచరీ కొట్టబోతున్నాయి.

అయినా కూడా జగన్ తన మొండి పంతాన్ని మాత్రం వీడట్లేదు పైగా న్యాయస్థానాలపై ఎదురుదాడుకి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర పరువు మంటగలుస్తున్నా జగన్ తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ప్రభుత్వానికి నేడు మరో మొట్టికాయ వేసింది ఏపీ హైకోర్టు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల సీట్లను 88 నుండి 40కి కుదిస్తూ తీసుకున్న నిర్ణయంతో కళాశాలల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసారు.

40సీట్లతో కాలేజీలను నడపలేమంటూ ఇలాగైతే కాలేజీలు మూసుకునే పరిస్థితి వస్తుందంటూ మొరపెట్టుకున్నారు ప్రభుత్వం చుట్టూ తిరిగినాఫలితంలేకపోవడంతో ఇక చేసేదేమీలేక హైకోర్టును ఆశ్రయించగా నేడు ఈ కేసుపై వాదనలు విన్న హై కోర్టు సీట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను కోర్టు కొట్టివేసింది. ఇక హై కోర్టులో ఫీజుల విషయంలో సైతం కళాశాలలు హైకోర్టులో ప్రభుత్వం పై పిటిషన్ దాకలు చేసాయి.

 

Read also… జగన్ ను ఒక దుష్టశక్తి గా అభివర్ణించిన న్యాయమూర్తుల బార్ కౌన్సిల్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular