గురువారం, మార్చి 28, 2024
Homeజాతీయంఏపీ ప్రభుత్వం వరాల జల్లు..వాళ్లకు 10 వేలు అడ్వాన్స్

ఏపీ ప్రభుత్వం వరాల జల్లు..వాళ్లకు 10 వేలు అడ్వాన్స్

ప్రస్తుతం దేవాలయాలన్నీ మూతపడ్డాయి జనం ఎక్కువగా  గుమిగూడకూడదని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి అయితే గుళ్లల్లో క్షరకుల ( నాయూ బ్రాహ్మణులు) పరిస్థితి దయనీయంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే వారి జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఏపీ ప్రభుత్వం నాయిూ బ్రాహ్మణులకు 10,000 రూపాయలను అడ్వాన్స్ గా ఇవ్వాలని నిర్ణయించినట్టు దేవాదయ శాక మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు.

రాష్ట్రంలోని ఎనిమిది దేవాలయాల్లో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలో 451 మంది కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం వీరికి ఉపాధి లేదు దీంతో కేశఖండన శాల జేఏసీ వీరిని ఆర్దికంగా ఆదుకోవాలని అభ్యర్ధించగా వాళ్ల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఆ దేవాలయాల్లో పనిచేసే క్షురకుడికి దేవాలయాలు పదివేల రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని నిర్ణయించింది.

పరిస్థితులు చక్కబడిన తరువాత ఇచ్చిన మొత్తాన్ని రెండు నెలల తరువాత నెలవారీ సులభ వాయిదా పద్దతుల్లో దేవాలయానికి జమ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పద్దతి వల్ల 968 మంది క్షురకులు లబ్ధిపొందుతున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular