గురువారం, ఏప్రిల్ 25, 2024
Homeరాజకీయంజగన్ ను ఒక దుష్టశక్తి గా అభివర్ణించిన న్యాయమూర్తుల బార్ కౌన్సిల్

జగన్ ను ఒక దుష్టశక్తి గా అభివర్ణించిన న్యాయమూర్తుల బార్ కౌన్సిల్

గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాలు న్యాయస్థానాల చుట్టూ జరుగుతున్నాయి. దీనిలో ప్రదానంగా క్రిందటి వారం నుండి తెలంగాణా హైకోర్టులో జగన్ కేసులు తిరిగి విచారణకు రావడం మొదలు ఒక్కసారిగా రాజకీయనాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం కాబోయే సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై  ఏపీ సీఎం జగన్ పిర్యాదు చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందంటూ న్యాయమూర్తుల బార్ కౌన్సిల్ అబిప్రాయం వ్యక్తం చేసింది.

న్యాయమూర్తులను టార్గెట్ చెయ్యడం వల్ల అది జగన్ కేసుల తెర్పులపై చాలా ప్రభావం చూపుతాయని తెలిపారు. జగన్ కేసులపై ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన చర్యగా అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక జగన్ చేస్తున్న చర్యలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

జగన్ న్యాయమూర్తులపై చేసిన చర్యను విద్రోహ చర్యగా తెలిపారు. అంతేకాక 16 నెలలు జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి నేడు న్యాయస్థానాల తీర్పులను ప్రశ్నించే స్థాయికి వచ్చారా అంటూ జగన్ పై మండిపడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  తాహాగా ఒక లేఖ విడుదల చేసింది.

ఆ లేఖలో న్యాయమూర్తులపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు బార్ కౌన్సిల్స్ బయటికొచ్చి వారికి అండగా గళం విప్పాలి ఎందుకంటే ఇలాంటి దుష్ట శక్తులను ఎప్పటికీ గెలవనివ్వకూనదు అంటూ ఆలేఖలో తెలిపారు. ఇదిలాఉండగా న్యాయమూర్తులపై జగన్ చేసిన పిర్యాదులపై సీఎం పదవి నుండి జగన్ ను తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే      

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular