గురువారం, మార్చి 28, 2024
Homeఅంతర్జాతీయంచైనాకు కౌంటర్ గా బోఫోర్స్ తో బోర్డర్ లో మోహరించిన భారత్

చైనాకు కౌంటర్ గా బోఫోర్స్ తో బోర్డర్ లో మోహరించిన భారత్

ఇండియా మరియు చైనా ల మద్య బోర్డర్ లో రోజురోజుకూ టెన్షన్ వాతావరణం నెలకొంటుండడంతో రెండు దేశాలు ఎల్ఓసీ వద్ద బలగాలతో పాటు యుద్ద విమానాలను కూడా రంగంలోకి దింపుతున్నాయి. గత వారం నుండి చైనా వైపు ఆర్టిలరీ గన్స్ మోహరించడంతో భారత్ సైతం తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు బోఫోర్స్ హెవీ ఆర్టిలరీ గన్స్ బోర్డర్లో మొహరించిది.

సుమారు 60 బోఫోర్స్ గన్స్ ను లద్దాక్ బోర్డర్ కి రవాణా చేసినట్లు సమాచారం. బోఫోర్స్ ఆర్టిలరీ గన్స్  భారత్ మరియు పాకిస్థాన్ కార్గిల్ యుద్ద సమయంలో పాకిస్థాన్ ను చిత్తుచేసి భారత్ యుద్ధం గెలవడానికి బోఫోర్స్ ప్రదాన భూమిక పోషించాయి.

భారత్ తో ఆనుకుని ఉన్న పాకిస్థాన్ మరియు చైనా బోర్డర్ ప్రాంతాలు చాలా వరకూ ప్రాంతాలు అత్యంత ఎత్తులో ఉండడం వల్ల శత్రువుల దాడులకు మరింత సులువు అవుతుంది. దీనిని నిరోదించడానికి భారత్ బోఫోర్స్ ను రంగంలోకి దించింది. వీటితో అత్యంత ఎత్తయిన పర్వత ప్రాంతాలలో ఉన్న శత్రువులను టార్గెట్ చేసి తుదముట్టిస్తాయి.

155 ఎంఎం కేలిబర్ గల ఈ గన్స్ సుమారు 35కి లోమీటర్ల పరిదిలో ఉన్న టార్గెట్ ను సైతం ఇవి చేదిస్తాయి. దీనితో పాటు భారత్ లో దేశీయంగా తరారు చేస్తున్న ధనుష్ ఆర్టిలరీ గన్స్ ను భారత్ మెకిన్ ఇండియా లో భాగంగా బోఫోర్స్ కంటే అత్యాదునిక టెక్నాలజీతో భారత్ లోనే వీటిని తయారు చేస్తున్నారు.

భారత్ తన భూబాగంలో రోడ్లు, వంతెనలు నిర్మిస్తుంటే చైనా చూసి ఓర్వలేక ఆయా భూబాగాలు తమవేనంటూ భారత్ పై విషం చిమ్ముతుంది. అయితే భారత్ మాత్రం చైనా చేస్తున్న తాటాకు చప్పుళ్ళను పట్టించుకోకుండా బోర్డర్ ప్రాంతాలలో ఉన్న రోడ్లు, బ్రిడ్జ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 12000 మంది కార్మికులని అక్కడికి పంపింది.

అంతే కాకుండా చైనా బోర్డర్ కి సమీపంలో యుద్దవిమానాల లాండింగ్ కి బేస్ నిర్మించడంతో భారత్ సైతం యుద్ధవిమానాలు మరియు బలగాల తరలింపుకు బేస్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు చైనా కు కౌంటర్ ఇవ్వడానికి దక్షిణ కాశ్మీర్ కు సంబందించిన ఒక హైవే పై యుద్ద విమానాల లాండింగ్ కొరకు ఎయిర్ స్ట్రిప్ కనస్ట్రక్షన్ మొదలు పెట్టింది. ఇది సుమారు మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మించనుంది.

అయితే భారత్ కొన్నాళ్ళుగా చాలా ప్రదేశాలలో హైవేలపై లాండింగ్ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది దీనికి కారణం శత్రు దేశాలు యుద్ద విమానాల ఎయిర్ బేస్ లను పూర్తిగా నాశనం చేసినా దగ్గరలోని హైవేలపై సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి వీలుగా వీటిని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం రెండు దేశాల నేతలూ ఈ నెల 6న చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

అయితే నేడు చైనా బలగాలు 3కిలోమీటర్ల్ వెనక్కి వెల్లగా భారత్ తాను ఉన్న ప్రదేశం నుండి ఓక కిలో మీటర్ వెనక్కి వెళ్ళింది. ఇప్పటికే మూడు సార్లు చర్చలు విఫలం అవ్వగా మరోసారి విఫలం అయితే చైనా తన వక్ర బుద్దితో భారత్ పై దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో భారత్ సైతం ముందుగానే బోఫోర్స్ గన్స్ చైనా పై ఎక్కుపెట్టి ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కోవడానికి రడీగా ఉంది.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular