గురువారం, ఏప్రిల్ 18, 2024
Homeఅంతర్జాతీయంచివరికి చైనా ఒప్పుకుంది.. భగ్గుమంటున్న ఇతర దేశాలు

చివరికి చైనా ఒప్పుకుంది.. భగ్గుమంటున్న ఇతర దేశాలు

కరోనా వైరస్ చైనా లోని  లాబ్స్ లోనే పుట్టిందని దీనిలో చైనా ప్రమేయం ఉందని అమెరికా మొదటి నుంచీ చైనా దేశం పై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే ఇక అమెరికాకు చెందిన తమ పరిశోధకులు కరోనా ల్యాబ్ నుండే పుట్టిందని తెల్చేసారని త్వరలోనే వాటిని సంబందించిన  ఆధారాలతో బయటపెడతామని చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. ప్రస్తుతం ఈ జగడం రోజు రోజుకు రాజుకుంటోంది. ప్రపంచ దేశాలు కూడా దీనిపై చాలా గుర్రుగా ఉన్నాయ్.

ఇలాంటి తరుణంలో చైనా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కరోనా వైరస్‌ వ్యాపించిన మొదట్లో అక్కడ సేకరించిన నమూనాలను నాశనం చేయాలని తామే ఆదేశించినట్లు చైనాకు చెందిన ‘నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ‘(ఎన్‌హెచ్‌సీ) ఆర్గనైజేషన్ అంగీకరించింది. అప్పటి వరకూ సార్స్‌ కోవ్‌2ను గుర్తించకపోవడం వల్ల ఆ నమూనాల కారణం చేత వైరస్‌ ఎక్కువ మందికి వ్యాపించకుండా తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌సీలోని సైన్స్‌ అండ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్‌ స్వయంగా ప్రకటించారు.ప్రస్తుతం ప్రపంచదేశాలకు వుహాన్ పేరు వినిపిస్తే భగ్గుమంటున్నాయి.

వుహాన్​ నగరం లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిన సంగతిఅందరికీ తెలిసిందే ఇదే ఇప్పుడు ప్రపంచం స్తంభించి పోడానికి కారణం కోడా అయింది అయితే అదే వుహాన్ లో  తొలి రోజుల్లో సేకరించిన నమూనాలను తాము ధ్యంసం చేశామని ఒప్పుకుంది చైనా. గతంలో చైనా ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌ వైరస్ వంటి‌ నమూనాలను ప్రపంచ దేశాలకు అందించిన చైనా ప్రస్తుతం కొవిడ్​ తొలి నమూనాలను మాత్రం అక్కడ నాశనం చేసినట్లు స్పష్టం చేసింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా ఒకరకంగా చైనా పై ఒత్తిడి పెంచే చర్యలు మొదలుపెట్టింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular