శుక్రవారం, ఏప్రిల్ 19, 2024
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ కు దగ్గరవుతున్న చైనా... ప్రమాదం లో భారత్

ఇజ్రాయెల్ కు దగ్గరవుతున్న చైనా… ప్రమాదం లో భారత్

గత కొన్నాళ్లుగా  పలు  దేశాల మద్య సంబదాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. రష్యా , ఇజ్రాయెల్ దేశాలు చైనాతో బలమైన సంబందాలు ఏర్పడటం ఇప్పడు భారత్ మరియు అమెరికాకు పెను సవాలుగా మారుతుంది. అయితే అమెరికా ఇంటెలిజెంట్ నివేదికలు సైతం చైనా మరియు ఇజ్రాయెల్ సంబందాలు మరింత బలపడటం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం చైనా ఇజ్రాయెల్ లోని పారిశ్రామిక రంగాలపై విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుండటం, ఇజ్రాయెల్ లోని పలు రైల్ నెట్వర్క్, కొండప్రాంతాల్లోని రహదారులకు టన్నెల్స్, పోర్ట్స్, నిర్మిస్తుంది.

తాజాగా ఇజ్రాయెల్ తన హైపర్ పోర్ట్ కంటైనేర్ టెర్మినల్ ను 50సంవత్సరాల వరకూ చైనాకు లీజ్ కి ఇవ్వడంతో ఈ వ్యవహారం పై అమెరికా ఇజ్రాయెల్ పై గుర్రుగా ఉంది. అతి తక్కువ కాలం లోనే చైనా ఇజ్రాయెల్ లోని ఆర్దిక వ్యవస్థ తన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రమాదం లేకపోలేదు. సిలికాన్ వ్యాలీలో చైనా బారీగా ఇన్వెస్ట్ చేసి దాన్ని బూచిగా   చూపి చైనా ఇజ్రాయెల్ యొక్క లేటెస్ట్ టెక్నాలజీని ఎత్తుకుపొతుంది. దీనిపై అమెరికా సైతం చాలా సార్లు హెచ్చరించింది.

ప్రస్తుతం నెతన్యాహు ఇజ్రాయెల్ కి ప్రధానిగా మూడవ సారి ఎన్నిక కాబడ్డారు. ఒకవైపు ఇది నరేంద్ర మోడీ సారద్యంలో బారత్ కు అనుకూల అంశమే అయినా కొందరు విశ్లేషకులు మాత్రం చైనాకు ఉపయోగపడే అంశంగానే బావిస్తున్నారు. భారత్ ఇజ్రాయెల్ ఎప్పటినుంచో మంచి మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. భారత్ ఇస్రాయెల్ నుంచి డ్రోన్లు, స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, బరాక్ మిస్సైల్స్ వంటివి దిగుమతి చేసుకుంటున్నాం అయితే చైనా ఇజ్రాయెల్ స్నేహంతో భారత్ కు ఇది సందిగ్ద పరిస్తితి అనే చెప్పాలి.

ఎందుకంటే చైనా అమెరికా తయారు చేసే ప్రతీ ఆయుదాల కీలక సమాచారం చోరీ చేసి వాటికి డూప్లికేట్ ఆయుదాలు తయారు చేసింది. అయితే చైనా ఎంట్రీ తో రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలి. ప్రస్తుత పరిస్థితిలో చైనా ఇజ్రాయెల్ ఒక్కటవ్వడం భారత్ మరియు అమెరికాకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular