గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంకరోనా వైరస్ జ్వరం లాంటిది : జగన్

కరోనా వైరస్ జ్వరం లాంటిది : జగన్

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరగటంతో సీఎం జగన్ నేడు మీడియా సమావేశంలో రాష్ట్రం లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతగానో కృసి చేస్తుందన్నారు. ఢిల్లీ వెళ్ళిన వారిలో మన రాష్ట్రం నుండి ఇంచుమించు 1085 మంది ఉన్నారన్నారు. వీరిలో 585 మందికి టెస్ట్స్ నిర్వహించామన్నారు.

మిగతా వారు కూడా తమకు తాము వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వీరితో కాంటాక్ట్ లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇప్పటివరుకూ 81% కేసులు ఇంటినుండే వైద్యం చేయించుకుని నయమైన వారు సమాజంలో తిరిగే పరిస్థితిలో ఉన్నారన్నారు.

కరోనా దాడితో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు పూర్తిగా మంధగించాయన్నారు. భారం అయినప్పటికీ ఉధ్యోగుల జీతాలను, ప్రజా ప్రతి నిదులను, ఐఏఎస్, ఇపీఎస్ అధికారులను వారి జీతాలను పోస్ట్ పోన్ చేసే అధికారం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

గ్రామాలలో వ్యవసాయం చేసుకునే రైతులు, రైతు కూలీలు మరియు ఆక్వారంగ రైతులు మీ గ్రామాలలో ఒంటి గంట వరకూ మీ పనులు చేసుకోవచ్చని అన్నారు. పని చేసే టప్పుడు ఒక మీటర్ దూరం ఉండేటట్లు చూసుకోవాలను కోరారు. కరోనా అనేది ఒక జ్వరం లాంటిదని దీని గురించి బయపడవద్దన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular