గురువారం, మార్చి 28, 2024
Homeజాతీయంవిశాఖ భూగర్భంలో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్.. భారీ ప్రాజెక్ట్ చేపట్టిన కేంద్రం

విశాఖ భూగర్భంలో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్.. భారీ ప్రాజెక్ట్ చేపట్టిన కేంద్రం

Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ కు ఆర్దికంగా వెన్నుదన్నుగా నిలిచిన నగరాలలో ఉక్కు నగరం విశాఖపట్నం మొదటి స్థానంలో ఎప్పుడూ నిలుస్తుంది. దీనికి ప్రధాన కారణం బౌగోళికంగానూ,  ఆర్ధికంగానూ అత్యంత స్పీడ్ గా డెవలప్ అవుతున్న నగరాలలో ఇదీ ఒకటి ఇక ఇండస్ట్రియల్ పరంగా విశాఖ అందరికీ అనువైన నగరం కావున పెట్టుబడులకు అనువుగా ఉండడం వల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

కేంద్రం ప్రకటించిన నగరాలు

ఇక పూర్తి వివరాలలోకి వెళితే భారత్ లో కొన్ని ప్రముఖ నగరాలలో విదేశాల నుంచి భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసి దానిని మన దేశంలో నిల్వ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నగరాలను కేటాయించగా వాటిలో మన విశాఖపట్నం ఒకటి కాగా ఇంకొకటి మెంగలూర్ దీనితో పాటు మరొక నగరం పడూర్ లను ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ నగరాలలో ఉన్న కొండలను సోరంగాలుగా త్రవ్వి ఆసోరంగాలలో ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలను భద్రపరుస్తారు.

చమురు నిల్వల సామర్ధ్యం

ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా రెండు స్టేజ్ లుగా కేటాయించి దానిలో మొదటి స్టేజ్ లో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ నిల్వ చేయడానికి సరిపడా సొరంగాలను కన్స్ట్రక్ట్ చేస్తారు. రెండో ఫేజ్ లో దీనిని 6.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు దీని సామర్ధ్యం పెంచుతూ ఈనెలలో మోడీ ప్రభుత్వం పచ్చజెండా వూపింది.

విశాఖపట్నానికి కేటాయించిన చమురు

ఇప్పటికే మొదటి ఫేజ్ పనులు చాలా వరకూ పూర్తి కాగా ఈ ప్రాజెక్ట్ ను త్వరిత్ గతిన పూర్తి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇక ఈ స్టోరేజ్ కోసం భూమి కేటాయింపునకు 210 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇక కేంద్రం సెలక్ట్ చేసిన మూడు నగరాలలో విశాఖపట్నానికి 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు, మంగుళూర్ కి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు పడూర్ కి 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేటు భారీ గా పతనం అవుతున్న నేపధ్యంలో పలు దేశాలు క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ పై ద్రుష్టి సారించి భారీ గా ఆదాయం సమకూర్చుకోవాలని బావిస్తిన్న తరుణంలో ఇప్పటికే భారత్ ముందు చూపుతో చాలా వరకూ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాబోతోంది. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలతో దేశంలో కొంతవరకూ ఆయిల్ ధరలు తగ్గే అవకాసం కనిపిస్తోంది.

అంతేకాక రాభోవు కాలంలో గల్ఫ్ దేశాలలో భారీ స్థాయిలో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం నిల్వ చేసుకున్న చమురుతో పెద్దగా నష్టం ఉండదు. ఒకవిధంగా చెప్పాలంటే దేశానికి మరియి ప్రజలకూ రెండు విధాలా ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలు బవిష్యత్తులో దేశ ఆర్ధిక స్థితిని మరింత మెరుగుపడుతుందని నిపుణులు చెభుతున్నారు.

Read Also.. చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm 

భారత నేవీ అమ్ములపోదిలోకి MH-60R మల్టీరోల్ అటాకింగ్ హెలికాఫ్టర్లు

దేవినేని ఉమ కు 14 రోజుల రిమాండ్ | Devineni Uma Remand

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular