అంతర్వేదిలో రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిన సముద్రం..అందోలనలో గ్రామస్తులు

0
900
antarvedi
antarvedi

అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న అంతర్వేది గ్రామవాసులకు కొత్త సమస్య వచ్చిపడింది అంతర్వేది సమీప ప్రాంతాలలో ఉన్న సముద్రం ఇప్పుడు పది ఇరవై మీటర్లు కాదు ఏకంగా రెండు కిలోమీటర్ల వెనక్కు వెళ్లిపోవడంతో ఆ గ్రామవాసులు భయాందోలనకు గురవుతున్నారు. ఎప్పుడూ అలల శబ్దంతో పర్యాటకులను పలకరించే సముద్రం ఇప్పుడు కంటికి కనిపించనంత దూరానికి వెళ్ళిపోయింది. అమావాస్య మరియు పౌర్ణమి సమయాలలో వచ్చే ఆటుపోట్లలో కూడా ఎప్పుడూ ఇంత వెనక్కి వల్లలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

కొన్నిరోజుల క్రితం ఒక్కసారిగా సముద్రం ముందుకు రావడంతో గ్రామస్తులు భయందోలనకు గురయ్యారు ఇది గడిచి కొన్ని రోజులు కాకముందే ఒక్కసారింగా సముద్రం ఇంత వెనక్కి వెళుతుండడం అదికూడా భారీగా వర్షపు నీరు సముద్రంలో కలుస్తున్నా సముద్రం వెనక్కి వెళ్లడంపై పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటక ప్రదేశంగా ఉన్న ఈ బీచ్ డెవలప్మెంట్ ను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సమయంలో భారీగా బక్తులు ఈ బీచ్ కు వస్తుంటారు ఆ సమయంలో కూడా తగిన వసతి ఉండడం లేదని ప్రధానంగా స్త్రీలకూ మరింత ఇబ్బందిగా ఉంటుందని భక్తులు విమర్శిస్తున్నా ప్రభుత్వం ఈ బీచ్ డెవలప్మెంట్ విషయంలో మొద్దు నిద్ర వీడడం లేదు. ఇక సముద్ర ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు దగ్గరగా ఉన్న బీచ్ లు ప్రధానంగా మడ అడవుల వల్ల ఆయా గ్రామాలు కోతకు గురి కాకుండా ఆ అడవులు ఎంతగానో కాపాడతాయి.

ఇక అంతర్వేది సముద్ర గట్టు ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం ఉన్న మడ అడవి ఇప్పుడు కనుమరుగైంది. ఆప్రాంతంలో ఇప్పుడు రొయ్యల చెరువులు వెలిసాయి.  దీనితో ఎప్పుడు సముద్రం పోటెత్తి గ్రామాన్ని ముంచుతుందో అని గ్రామస్తులు భయాందోలన వ్యక్తం చేస్తూ ఉపద్రవం రాకముందే ఆ ప్రాంతంలో రొయ్యల చెరువులకు అనుమతి ఇవ్వవద్దంటూ అంతేకాక బీచ్ గట్టు ఉన్న ప్రాంతంలో చెట్లను నాటాలని, అంతేకాక పర్యాటకులకు సరైన వసతి గృహాలు నిర్మించాలని గ్రామస్తులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు.   

WhatsApp Group Join Now