మంగళవారం, ఏప్రిల్ 16, 2024
Homeరాజకీయంమేము చెప్పేవరకూ రాజధానిని తరలించ వద్దు హైకోర్టు

మేము చెప్పేవరకూ రాజధానిని తరలించ వద్దు హైకోర్టు

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై అక్కడి 25 గ్రామాల ప్రజలకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిని తరలిస్తూ తీసుకువచ్చిన జీవోపై కౌంటర్ గా అమరావతీ పరిరక్షణ సాధన సమితిలోని ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు కొన్నాళ్ళ క్రితం హైకోర్ట్ లో ఫిల్ దాకలు చేయడంతో ఆయన తరపు అడ్వకేట్ ఉన్నం ప్రభాకర్ దీనిపై వాధించారు. ఈ విషయంపై  హైకోర్టు ధర్మాసనం దీనిని విచారించింది. ప్రస్తుత పరిస్థితులలో కూడా రాజధానిని తరలిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

పిటిషనర్ తన పిల్ లో ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమ సేక్రటేరియట్ ఉద్యోగులు మొత్తం మే 31 లోపు విశాఖకు వెళ్లాలని ప్రభుత్వం తెలపడంతో ఈ విషయాన్ని, విజయసాయి రెడ్డి విశాఖలో రాజధాని తరలింపు ఆపడం ఎవ్వరి తరం కాదనడం ఈ విషయాలన్నీ  పిటిషనర్ తన పిల్ లో తెలియజేసారు.  రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆమోదంకాకుండా రాజధాని వికేంద్రీకరణ జరపభోమని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అయితే హైకోర్టు మాత్రం నోటిమాటతో కాకుండా ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలని తెలిపింది.

అయితే ప్రమాణ పత్రం దాఖలుకు పదిరోజులు కడువు కోరడంతో హైకోర్టు దీనికి ఓకే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం కూడా రాజధాని తరలించాబోమని ప్రమాణ పత్రం దాకలు చెయ్యాలని కోరింది. ఇకపై రాజధాని తరలింపుపై ఎటు ఎటువంటి చర్యలూ చేపట్టకూడదంది. ఒకవేళ ఎటువంటి చర్యలు చేపట్టినా ముందుగా తమ అనుమతి తీసుకున్నాకే చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular