మంగళవారం, ఏప్రిల్ 16, 2024
Homeక్రీడలుటోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు స్వర్ణం సాదించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు స్వర్ణం సాదించిన నీరజ్ చోప్రా

ఒలింపిక్స్ అద్లేటిక్ క్రీడల్లో వంద సంవత్సరాల భారత్ కల నేడు నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ క్రడల్లో బాగంగా నేడు జావెలిన్ త్రో ఈవెంట్ లో భారత్ కు చెందిన క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారత్ కు వంద సంవత్సరాల తర్వాతా అద్లెటిక్ విభాగంలో భారత్ కు స్వర్ణం సాదించిపెట్టాడు.

నీరజ్ చోప్రా స్వర్ణం సాదించడంపై హర్యానా లో గల పానిపట్ వాసులు డ్యాన్సులు మిఠాయిలతో కోలాహలంగా మారింది.  ఇక neeraj chopra జావెలిన్ త్రో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటి నుంచీ ప్రత్యర్ధులకు ఎలాంటి చాన్స్ ఉవ్వకుండా 89.65 మీటర్లు విసిరి  ఫైనల్ కు చేరి తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు నీరజ్ చోప్రా.

ఇక ఫైనల్ లో తనతో పాటు మరో ఏడుగురు ప్రత్యర్థులతో పోటీలోకి దిగిన నీరజ్ చోప్రా మొదటి త్రో- 87.03, రెండవ త్రో-87.58, మూడవ త్రో 76.79, మీటర్లు విసిరినా నీరజ్ నాల్గవ మరియు ఐదవ త్రోలో పోల్ అయ్యాడు చివరి త్రో 84.24 మీటర్లు విసిరి భారత జెండాను రెపరెప లాడించాడు.

23ఏళ్ల నీరజ్ చోప్రా ఒలంపిక్స్ గేమ్స్ లో పాల్గొన్న మొదటి సారే భారత్ కు గోల్డ్ తీసుకు రావడంపై రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు BSF, CRPF జవాన్లు సైతం ఆనందంవ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తం నీరజ్ చోప్రా సాదించిన ఘనతను కొనియాడుతున్నారు.

  

  

 

 

 

 

 

                                                                                                            

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular